కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిస్తూనే…దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తారంటూ మరొక వాదన వినిపిస్తుంది. ఒక వేళ హైదరాబాద్‌ను యుటీ చేస్తే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ పెరుగుతుందని…అది బీజేపీ ఉనికికే ప్రమాదం అని..కొంత మంది కమలనాథులు అంటున్నారు. తాజాగా హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి…ఈ వ్యవహారంపై స్పందించారు. దేశానికి రెండోరాజధానిగా హైదరాబాద్ ను చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సనత్ నగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిలో 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇక ఏపీ రాజధాని మార్పు విషయంపై మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని మారుతుందన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఇది కేంద్ర పరిధిలోకి రాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌ను దేశానికి సెకండ్ క్యాపిటల్ చేయడం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పడంతోగత కొద్ది రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.
