Home / SPORTS / ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?

ఆ ఒక్కడే వార్నర్ కు మొగుడయ్యాడు…?

ప్రపంచకప్ తరువాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆడుతున్న సిరీస్ యాసెస్ నే. ఈ సిరీస్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా అందులో ఒకటి ఆస్ట్రేలియా గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రస్తుతం మూడో మ్యాచ్ జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే డేవిడ్ వార్నర్..ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే. తాను పిచ్ లో అడుగుపెడితే ఎవరైనా బయపడాల్సిందే. అలాంటి బాట్స్ మెన్ ప్రస్తుతం బంతి ఎదుర్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఒకప్పుడు వార్నర్ ని దాటి వెళ్ళడానికి బయపడేవారు. కాని ప్రస్తుతం జరిగే యాసెస్ సిరీస్ లో మాత్రం చాల దారుణంగా ఆడుతున్నాడు. ఒక్క ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ చేతిలోనే మొత్తం ఆరు ఇన్నింగ్స్ లో నాలుగుసార్లు అవుట్ అయ్యాడు. దీంతో వార్నర్ కి బ్రాడ్ మొగుడులా తయారయ్యాడని అంటున్నారు.