వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విధ్యార్ధులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు విద్యార్ధుల పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీనంతటికీ కారణం డ్రైవర్ నే అని, తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఇక మరోపక్క డ్రైవర్ మరియు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
