తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ – 4 ఎగ్జామ్స్ ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ నెల 9 నుంచి అక్టోబరు 18 వరకు గ్రూప్-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిమిత్తం అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.కాగా గత ఏడాది టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల చేసింది. 1867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అక్టోబర్ 7 న రాతపరీక్ష నిర్వహించబడింది. మార్చి 20 న గ్రూప్ – 4 ఫలితాలను ప్రకటించింది. మొత్తం 2,72,132 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 %; బీసీలకు 35 %; ఎస్సీ, ఎస్టీలకు 30 శాతంగా నిర్ణయించారు. ఈ ప్రాతిపదికనే అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేశారు. అయితే నియామక ప్రక్రియలో భాగంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ నెల 9 నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువ పత్రాలు పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది.
