ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు కూడా కేటాయించడం జరిగింది.