వరంగల్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర కొనసాగుతోంది. నిన్న మంగళవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంత రావు నివాసంలో రాజశ్యామల దేవి పీఠ పూజ చేసిన స్వామివారు భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చి అనుగ్రహభాషణం చేశారు. తదనంతరం స్వామివారు వరంగల్ నగర భక్తుల కోరిక మేరకు వారి ఇండ్లకు వెళ్లి స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హిందు ధర్మ గొప్పతనాన్ని వివరించారు. కేసీఆర్ నగర్ లోని బానోతు కల్పన-సింగు లాల్ గోపాలపురం లోని సిరంగి సునీల్, వేణుగోపాల్, కృష్ణమోహన్ ఇండ్లలో స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. అలాగే ఎన్టీవో కాలనీలో వెంకటేశ్వర్లు ఇంటితో పాటు కాలనీలో ప్రతిష్టించిన అమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దరువు ఎమ్ డి చెరుకు కరణ్ రెడ్డి, కార్పొరేటర్స్ సిరంగి సునీల్, బానోతు కల్పన మరియు ప్రచార సమన్వయ కర్తలు రాంమూర్తి పోలపల్లి, రాజేష్, తిరుపతి, శ్రీకాంత్ రెడ్డి, తదితర భక్తులు పాల్గొన్నారు.
