Home / BUSINESS / బిగ్‌సి డబుల్‌ ధమాకా ఆఫర్‌..!

బిగ్‌సి డబుల్‌ ధమాకా ఆఫర్‌..!

మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్‌ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుచేసిన వారికి 10 శాతం, పేటీఎంపై 30 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఉన్నట్లు చెప్పారు. సులభవాయిదా పద్దతిలో ఉచిత ఈఎంఐ సౌకర్యం ఉందని వెల్లడించారు.