ఈరోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంభందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. 1945 అక్టోబర్ 16న ఐరాస ఆహార మరియు వ్యవసాయక సంస్థ స్థాపించబడింది. అయితే ఈ కార్యక్రమాన్ని మొదటిసారి 1981లో జరుపుకున్నారు. ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురష్కారించుకొని మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే ఆహారాన్ని వృధా చేయరాదు.