ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరికి ఇండియా నిర్ణీత 20ఓవర్స్ లో 148పరుగులు చేసింది. ఇక బ్యాట్టింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ పర్వాలేదు అనిపించినా చివర్లో కష్టాల్లో పడినట్టు కనిపించినా పాండ్య దయవల్ల విజయం సాధించారు. రహీమ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను వదిలేసాడు. అక్కడే మ్యాచ్ మొత్తం తిరిగిపోయింది. ఆ చిన్న తప్పు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయడమే కాకుండా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించేలా చేసింది. ఇప్పటివరకు ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆ జట్టు ఇప్పుడు గెలిచేసింది.
