వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి వస్తే ఫైనల్ కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించాడు. ఆస్ట్రేలియా గ్రౌండ్స్ లో ఆడడం అంటే మామోలు విషయం కాదని అందరికి తెలుసు. మరి గిల్లీ భారత్ పై నమ్మకం పెట్టుకున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే.