నిన్న నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరిగిన మూడో టీ20 తో భారత్ మరో రికార్డ్ సాధించింది. ఏ ఇతర జట్టు ఈ ఫీట్ ని సాధించలేదు. ఇందుకు ఏమిటా రికార్డ్ అనుకుంటున్నారా. ఈ ఏడాది మూడు ఫార్మాట్లో హ్యాట్రిక్ సాధించిన వికెట్స్ సాధించిన జట్టు ఇండియానే. టెస్టుల్లో బూమ్రా, వన్డేల్లో షమీ, నిన్న టీ20ల్లో చాహర్ హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. ఏ జట్టులో కూడా ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించలేదు. ఈ ఏడాది భారత్ కు బాగా కలిసొచ్చిన అంశమని చెప్పొచ్చు. ఇదే ఊపు కొనసాగిస్తే భారత్ ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
