హైదరాబాద్‌లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినా ఏమాత్రం భయం లేకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా దిశ ఘటన తరహాలోనే ఓ మహిళకు మద్యం తాగించి అత్యాచారం తాగించిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేరెడ్‌మెట్‌లో నర్సయ్య అనే కాంట్రాక్టర్ తన దగ్గర పని చేస్తున్న ఓ యువతికి మద్యం తాగించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే..నర్సయ్య అనే భవన నిర్మాణ కాంట్రాక్టర్ దగ్గర కొందరు మహిళా కూలీలు పని చేస్తున్నారు. అందులో ఓ మహిళపై నర్సయ్య కన్నేసాడు. ఎప్పట్లాగే విధులు ముగించుకుని వెళుతున్న కార్మికుల గుంపును ఆపి, చిన్న సిమెంట్ వర్క్ ఉంది..అది పూర్తి చేసి వెళ్లమని ఆ మహిళను ఆదేశించాడు. మిగతా కూలీలు అందరూ వెళ్లిపోయాక సిమెంట్ పని కోసమని సదరు మహిళను లోపలికి తీసుకువెళ్లిన నర్సయ్య ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత మద్యం మత్తులోకి జారుతున్న మహిళపై అత్యాచారం చేశాడు. అయితే మద్యం మత్తులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆ మహిళకు మరుసటి రోజు ఉదయం వరకు మెలుకువ రాలేదు. పొద్దున్నే మెలుకవ వచ్చిన ఆ బాధితురాలు తనకు మద్యం తాగించి నర్సయ్య అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే అందరూ కలిసి కీసర పోలీస్‌స్టేషన్‌లో కామాంధుడైన కాంట్రాక్టర్ నర్సయ్యపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నర్సయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తంగా ఎన్ని నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు చేసినా..మహిళలపై కామాంధుల అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి అత్యాచారాలకు పాల్పడిన మానవ మృగాళ్లకు అరబ్ దేశాల తరహాలో కఠిన శిక్షలు విధించేలా చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
