సౌతాఫ్రికా వేదికగా అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్వాటర్ ఫైనల్ జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. ఇక బ్యాట్టింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50ఓవర్స్ లో 232పరుగులు చేసింది. ఓ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియా గెలిచేలా ఉందని అనుకున్నారంతా. కాని పేసర్ కార్తిక్ త్యాగి బౌలింగ్ ధాటికి 20పరుగులకే 4వికెట్లు కోల్పోయింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరికి 159పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ ఏడాది సెమీస్ కు వెళ్ళిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.
