ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇందులో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ తీసుకుంది. విరాట్ ప్లేస్ లో రోహిత్ రావడం జరిగింది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవశం చేసుకుంది. భారత్ క్వీన్ స్వీప్ పై కన్నేయగా కివీస్ మాత్రం కనీసం ఒక మ్యాచ్ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో మరో విషయం చూసుకుంటే సంజు శాంసన్ కి రెండుసార్లు అవకాశం ఇవ్వగా ఆడలేకపోయాడు. ఇక ఇదే చివరి ఛాన్స్ అనుకోవాలి. ఇది కూడా ఆడకుంటే అతడికి కష్టమనే చెప్పాలి.