శివం దూబే..ఆదివారం జరిగిన మ్యాచ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ భాద్యతలు తీసుకోగా, మ్యాచ్ మధ్యలో రోహిత్ కి గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. దాంతో మొదటిసారి రాహుల్ కి ఛాన్స్ వచ్చింది. తన కెప్టెన్సీ లో మొదటి మ్యాచ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరో విషయం ఏమిటంటే ఇందులో భాగంగా దూబే వేసిన ఓవర్ లో ఏకంగా 34పరుగులు సమర్పించుకొని రెండో అత్యధిక ఎక్ష్పెన్సివ్ ఓవర్ గా నిలిచింది.
