ఆక్లాండ్ వేదికగా శనివారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోహ్లి సేన. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన కివీస్ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. గుప్తిల్ 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ లాథమ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించిన టేలర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో 73పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుస్కోర్ ని ముందుకు నడిపించారు. కివీస్ నిర్ణీత 50ఓవర్స్ లో 8వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
