ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా..దీనికి ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇక భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరంగా తెలంగాణ లో చూసుకుంటే ఒక కేసు నమోదు అయ్యింది. అయితే కరోనా ప్రబావంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల్లో ఎవరికైనా జలుబు, రొంప, జ్వరం వంటివి వస్తే స్కూల్ కు రావొద్దని విద్యా శాఖా డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు టీచర్స్ అయినా సరే రావొద్దని. మొత్తం తగ్గినాకే రావాలని చెప్పారు. ఇక స్కూల్ ప్రాంగణంలో ప్రతీ సోమవారం ఉదయం ఈ వైరస్ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్కూల్స్ లో రోజుకు నాలుగుసార్లు చేతులు కడుక్కోవాలని ఈమేరకు అదనంగా నీరును ఉంచాలని ఆయన అన్నారు.
