Home / TELANGANA / ఎదురింటి యువకుడిపై పోలీసులకు అమృతా ప్రణయ్ ఫిర్యాదు..ఏం చేశాడో తెలుసా..?

ఎదురింటి యువకుడిపై పోలీసులకు అమృతా ప్రణయ్ ఫిర్యాదు..ఏం చేశాడో తెలుసా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్ర‍ణయ్ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఇటీవల హైదరాబాద్‌‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకోవడంతో చివరి చూపు చూడకుండానే వెనక్కి వెళ్లిపోయిన అమృత కొద్ది రోజుల క్రితం పోలీసుల సహాయంతో తన తల్లి గిరిజను కలుసుకుని పదినిమిషాల పాటు మాట్లాడారు. ఇదిలా ఉంటే మిర్యాలగూడలో తన అత్తమామల ఇంట్లో ఉంటున్న అమృతా ప్ర‍ణయ్ తాజాగా ఓ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురుగా ఉండే విజయ్‌ అనే యువకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు కరీంకు చేరవేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

 

కాగా గత ఏడాది దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ కేసులో కరీం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అమృత బాబాయ్ శ్రవణ్‌తో కూడా కరీంతో పాటు ప్రణయ్ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు. బాబాయ్‌తో ఆస్తి వివాదాల నేపథ్యంలో అమృత ఇంటికి ఎదురుగా ఉండే విజయ్ అనే యువకుడు ఎప్పటికప్పుడు ఆమె కదలికలను కరీంకు చేరవేస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎదురింటి యువకుడు తనను ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండడంతో అప్రమత్తమైన అమృత సదరు విజయ్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో అమృతకు మరింతగా భద్రత పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అత్తమామలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.