తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందు జాగ్రత్త లు తీసుకున్నా ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం లో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ కు వెళ్లకుండా తమ ఇండ్ల కు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కూడా అంటిస్తున్నారు. కొత్తగూడెం డీఎస్పీ విదేశాలనుండి వచ్చిన కొడుకుని క్వారంటైన్ కు పంపకుండా ఫంక్షన్ లకు తిప్పి తనకు అంటించుకోకుండా తన ఇంట్లో పని మనిషికి కూడా కరోనా వైరస్ ని అంటించాడు. దీంతో రాష్ట్రం లో కాంటాక్ట్ కేసులు కూడా నమోదు అవడం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. తాజాగా కుత్బుల్లాపూర్ లో నమోదైన మరో కరోనా కేసు మరింత కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి కరోనా లక్షణాల తో ఆసుపత్రిలో చేరాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడి నలుగురు కుటుంబ సభ్యులను కూడా గాంధీ హాస్పిటల్ కు తీసుకు వెళ్లి పరీక్షలు నిర్వహించగా వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంtఅని తేలింది.ఒకే కుటుంబంలో 5 గురికి పాజిటివ్ అని తేలడంతో ఆ కుటుంబం ఎవరెవరిని కలిసిందో అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఒకే కుటుంబం లో ఉన్న ఐదుగురికి కరోనా రావడంతో విదేశాలనుండి వచ్చిన వారికే కాకుండా వారి ద్వారా లోకల్ కాంటాక్ట్ కేసులు కూడా పెరుగుతున్నాయని రూఢి అయింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. లాక్ డౌన్ ను మరింత కఠినం గా అమలు చేసేందుకు సిద్దమవుతుంది.
