కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు బుధవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. గత జూన్ నెలలోనూ ప్రియాంకాగాంధీ కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే.అయితే తనకు రెండోసారి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇంట్లోనే హోంఐసోలేషన్ లో ఉన్నట్లు ఆమె బుధవారం ట్వీట్ చేశారు.
తన సోదరుడైన రాహుల్ గాంధీ కూడా అనారోగ్యానికి గురవడంతో అతను బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ నగరంలో జరగనున్న నేతృత్వ సంకల్ప శిబిరానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గతంలో కరోనాకు చికిత్స కోసం ఢిల్లీల్లోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు.
కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ హెడ్ పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనూ సింగ్వీలకు కూడా కరోనా సోకింది. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కూడా మంగళవారం కొవిడ్ సోకింది. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఖర్గే ట్వీట్ లో కోరారు.