Home / SLIDER / గ్రూప్‌ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

గ్రూప్‌ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది.

దీని గురించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ ‘రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారుల నియామకం జరుగబోతున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదలచేసింది. గ్రూప్‌ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య.

దీంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టిసారించవచ్చు. వార్డు అధికారులకు కౌన్సిలర్లతో మంచి సమన్వయం జరుగుతుంది. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino