Home / SLIDER / ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా

ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా

ప్రతిభగల క్రీడాకారులకు అన్ని వేళల ప్రోత్సాహం అందిస్తానని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34వ జాతీయస్థాయి అండర్ 13 జూనియర్ బ్యాడ్మింటిన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింగిల్స్ విభాగంలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన కూచిపూడి కి చెందిన భూక్య నిశాంత్ కు అభినందనలు తెలిపి, సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. మారుమూల గ్రామం నుండి బ్యాడ్మింటన్ క్రీడలో సాధన చేసి జాతీయ స్థాయికి నిశాంత్ ఎదగడం అభినందనీయమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నిశాంత్ జాతీయస్థాయిలో రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. బ్యాడ్మింటన్ క్రీడతో నిశాంత్ కోదాడ పేరును రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గమనర్హం అన్నారు.

అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రాష్ట్రానికి కోదాడకు పేరు తేవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోదాడ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామారావు క్రీడాకారునికి 20016లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు భూక్య నాగేశ్వరరావు నాగమణి, రంగారావు, గ్రామ పెద్దలు, వారి బంధువులు,తదితరులు పాల్గొన్నారు,

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat