Home / SLIDER / ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 8వ సెషన్‌లో 4వ సమావేశాలు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేరోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ర్ట బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు? ఏయే అంశాలపై చర్చ ఉంటుంది? తదితర విషయాలపై మొదటి రోజే స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీలో, శానసమండలి చైర్మన్‌ అధ్యక్షతన శాసనమండలిలో జరిగే బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

బడ్జెట్‌పై కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
—————————–
బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గత కొన్ని రోజులుగా 2023-24 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నవిషయం తెలిసిందే. బడ్జెట్‌ రూపకల్పనలో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యాలపై సీఎం కేసీఆర్‌ పలుసూచనలు చేసినట్టు తెలిసింది. వివిధ శాఖలకు గత బడ్జెట్‌లో కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై నివేదికలు తెప్పించుకొని సమగ్రంగా చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఒకటిన కేంద్ర బడ్జెట్‌
—————————–
కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. ఇందులో రాష్ర్టానికి సంబంధించి తేలాల్సిన లెక్కలు రెండు మాత్రమే ఉంటాయి. ఎఫ్‌ఆర్బీఎం పరిమితి ఎంత? కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు వచ్చే వాటా ఎంత? వీటిపై కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి వచ్చే నిధులపై అధికారులు ఒక అంచనాకు వస్తారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను వారం రోజుల్లో సిద్ధం చేసి ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

రూ.3 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌?
—————————–
ప్రస్తుత (2022-23) ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఇంకా మిగిలి ఉన్న రెండు నెలలు కూడా కలుపుకుంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయ (స్టేట్‌ ఓన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ) వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. దాదాపు 19 నుంచి 20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలుస్తున్నది. దేశ చరిత్రలోనే ఇంతవృద్ధి రేటు సాధించిన రాష్ట్రం మరొకటి లేదని ఆర్థిక నిపుణలు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆర్థికంగా ఆంక్షలు విధించింది. కేంద్రం చర్యలతో దాదాపు రూ.15 వేల కోట్ల వరకు నష్టపోయామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పాత బకాయిలతోపాటు కేంద్ర బడ్జెట్‌లో మనకు న్యాయంగా దక్కాల్సిన నిధులను సక్రమంగా కేటాయిస్తే రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలపై కేటాయింపులు మరింత అధికంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat