కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.
