తెలంగాణ రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించింది.
ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్కు వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను సృష్టించింది.