కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్ హిందూ స్మశానవాటికలో రూ.45 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కాంపౌండ్ వాల్, బోర్ వెల్, నీటి సంపు పూర్తి కావడంతో మిగిలి ఉన్న బాత్ రూమ్ లు, బర్నింగ్ ప్లాట్ ఫామ్ లు, సిట్టింగ్ గ్యాలరీ, బెంచీలు, ఇంటర్నల్ రోడ్డు మరియు మొక్కలు నాటి మోడల్ గ్రేవియార్డుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, ఏఈ సురేందర్ నాయక్, కాలనీ అధ్యక్షుడు ఏసు తదితరులు పాల్గొన్నారు.