కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 10 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ రావు గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
