ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు.
రూల్ 198(బీ) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జరిగే లోక్‌సభ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాలని ఆయన సెక్రటరీ జనరల్‌ను కోరారు.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయల్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఫైల్ చేశారు.మణిపూర్ అంశంపై చర్చకు ప్రధాని మోదీ ముఖం చాటేయడం వల్ల .. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంట్ వర్సాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా సభ సజావుగా సాగడం లేదు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం సరైందే అని బీఆర్ఎస్ భావిస్తోంది.