Home / SLIDER / సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాం ఆవిష్కరణ

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాం ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రులు డా. వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్లు రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తా లో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని MLC గోరేటి వెంకన్న గారితో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు తెలుగు గడ్డపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లు తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి ఎంతో భయంకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల బారి నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat