తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముందంజ.
ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా మిగిలిన రోడ్లను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి సారించి మంజూరు చేశారని గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు తెలిపారు.
జీవో 242 లో భాగంగా 33.48 కోట్లు మరియు జీవో 244 లో భాగంగా రూ. 16.00 కోట్లు రెండవ విడతలో మొత్తం 49.48 కోట్లు మంజూరు అయ్యాయని గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు అన్నారు. చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.