తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు.
నిన్న గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో మం డల కేంద్రంలో దళితబంధుతో పెట్టిన ‘దేశీ ఛాయ్’ వద్ద ఆగారు. నాయకులతో కలిసి టీ తాగి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారుడు అంజితో మాట్లాడారు.
రోజుకు ఎంత లాభం వస్తున్నది? దళితబంధు రాకముందు, వచ్చిన తర్వాత జీవన విధానంలో మార్పు వచ్చిందా? అని అడిగి తెలుసుకున్నారు. టీ స్టాల్ నిర్వాహకుడు అంజి మాట్లాడుతూ.. దళితబంధు పుణ్యమా అని వర్కర్ నుంచి ఓనర్‌గా మారానని, ఆర్థికంగా లబ్ధిపొందుతూ దర్జాగా బతుకుతున్నట్టు చెప్పాడు. దళితబంధు ఇచ్చి తనను ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.