మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మూడో రోజు 50వేల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసింది.శనివారం మూడో రోజు పలు చోట్ల హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి 50వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు 80వేలకు పైగా గణపతి విగ్రహాలను హెచ్ఎండిఏ పంపిణీ చేసింది.
మాదాపూర్ శిల్పారామం వద్ద హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.నానక్ రామ్ గూడలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.
హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, ప్లానింగ్ డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎస్.కే మీరా, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి ఇతర ఇంజనీరింగ్ అధికారులు, అధికారులు వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.