సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని ప్రభుత్వ విప్ మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుగారు అన్నారు జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని కోన మహాలక్ష్మి నగర్ కు చెందిన ఎస్ హనుమంతుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ 80000 చెక్కును గురువారం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు అందజేశారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని అమలు చేశారన్నారు ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్పన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు .
అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలుకల జగన్ గారు, నాయకులు రఫిక్ గారు, సీనియర్ నాయకులు ఎత్తారి మారయ్య, విజయరామ్ రెడ్డి, రుద్ర అశోక్, సోమేశ్ యాదవ్, దాసు, వెంకటేష్, శివ, తదితరులు పాల్గొన్నారు.