ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..అయితే జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..దాదాపు రూ. 40 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే కదా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు. అప్పుడే మిగతా రాష్ట్రాలు ప్రగతీపథంలో సాగుతున్న రాష్ట్రాలను చూసి స్ఫూర్తి పొందుతాయని పేర్కొన్నారు.
see also :విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జగన్ ఏం చెప్పాడు భయ్యా..?