మిథాలీరాజ్.. భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్కువే.. తన ఆటతో ఇండియాకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించింది. టీమిండియాకు సారధిగా వ్యవరించిన మిథాలీ రాజ్ జూనియర్స్ ని బాగా ప్రోత్సాహించేది. అలాంటి ప్లేయర్ తన స్టేట్మెంట్ తో అభిమానులకు షాక్ ఇచ్చింది. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ టీ20లు మొత్తం 88 ఆడగా అందులో 32 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించింది. కాగా 2,364 పరుగు చేసింది. రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత మీడియాతో మాట్లాడిన మిథాలీ.. యంగ్ ప్లేయర్స్ ను ప్రోత్సహించాలని మరియు వయస్సు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకునట్టు చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం 2021 ప్రపంచ కప్ పైనే ఉందని చెప్పింది.
