ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న జరిగిన సెమీస్ లో మాజీ విజేతలు ఇంటిమోకం పట్టారు. దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఇక మరో సెమీ ఫైనల్ లో ముంబై, బెంగాల్ తలపడగా చివరి వరకు ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి బెంగాల్ నే విజయం వరించింది. అయితే ఇంక 19న జరిగే ఫైనల్ లో ఢిల్లీ, బెంగాల్ ఆడనున్నాయి. మరి ఫైనల్ ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాల్సిందే.
