Breaking News
Home / TELANGANA / మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..

మంత్రి కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన తర్వాత, అక్కడి మెట్రో స్టేషన్ ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మెట్రోలో మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు వెళ్లి… మళ్లీ అక్కడ నుంచి మియాపూర్ కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మోదీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.

మెట్రో స్టేషన్ ప్రారంభం సందర్భంగా రిబ్బన్ కట్ చేసే సమయంలో మోదీ పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ నిల్చున్నారు. ఆ సందర్భంగా కొంచెం పక్కగా ఉన్న మంత్రి కేటీఆర్ ను పిలిచి తన పక్కన ఉంచుకున్నారు మోదీ. అనంతరం మెట్రో రైల్లో కూడా తన పక్కనే మంత్రి కేటీఆర్ ను కూర్చో బెట్టుకున్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ ఉండగా… ఆయన పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చున్నారు. రైళ్లో మోదీ చాలా హుషారుగా గడుపుతూ మంత్రి కేటీఆర్ తో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు.