Home / 18+ / రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..

రెండవ ఇన్నింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌లు బోల్తా..

రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్…443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా అనంతరం బౌలింగ్ లో బుమ్రా రూపంలో ఆస్ట్రేలియా పై విరుచుకుపడింది..దాని ఫలితమే వాళ్ళు 150కే అల్లౌట్ అయ్యారు.అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా టాప్ ఆర్డర్ అంతా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ దెబ్బకు పెవిలియన్ కి చేరుకున్నారు.అయితే మొదటి ఇన్నింగ్స్ లో సెంచురీ వీరుడు పుజారా మరియు సారధి విరాట్ కోహ్లి కూడా డక్ అవుట్ అవ్వడంతో ఇండియా కష్టాల్లో పడింది.ప్రస్తుతానికి మయంక్ అగర్వాల్,రిషబ్ పంత్ ఆటను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 54/5,అయినప్పటికీ లీడ్ మాత్రం 346 రన్స్ ఉండడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు.