Breaking News
Home / 18+ / మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!

మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.30వ తేదీన స్టార్ట్ అవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలవబోతుంది.ఈ మేరకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ ఈవెంట్ కు ఫేవరెట్ గా కొన్ని టీమ్ లు మొదటినుండి అనుకుంటున్నారు.ఇందులో హోమ్ జట్టు ఇంగ్లాండ్ మరియు ఇండియా ఉన్నాయి.ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా,ఇంగ్లాండ్ మెరుగ్గా రానిస్తున్నాయి.ఇక భారత్ పరంగా చుస్కుంటే మాత్రం అంతగా రాణించడం లేదు.మరి ప్రపంచకప్ భారత్ ఎలా రాణిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.ఇందులో ఇంకొక స్పెషల్ ఏమిటంటే భారత్ తరుపున మొదటిసారి కెప్టెన్సీ భాద్యతలు కోహ్లి చేపట్టారు. కపిల్ దేవ్,ధోని మరి ఇప్పుడు కోహ్లి పేరు కూడా ఇందులో చేరనుందా…!