Home / 18+ / తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్ గా నరసింహన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పదేళ్లుగా ఆయన ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లా నియామకం జరుగుతుందని హోంశాఖ వర్గాల సమాచారం.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నారు.అందులోకి కొత్త గవర్నర్ రానున్నాడు. విభజన చట్టం ప్రకారం పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో ఆయనే రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవరించారు. అయితే ఇప్పుడు హై కోర్ట్ కూడా విడిపోవడంతో కొత్త గవర్నర్ ను నియమించే యోచనలో ఉంది కేంద్రం.ఒక గవర్నర్ ని పదేళ్ళ కన్నా ఎక్కువ ఉంచడం బాగుందదనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తుంది.