Home / 18+ / ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?

ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?

ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఖరి ఘట్టం మన ముందుకు వచ్చేసింది.ఈరోజు లార్డ్స్ మైదానంలో ఆతిధ్య ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో ఒక స్పెషల్ కుడా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరూ గెలిచినా సంతోషమే అని భావిస్తున్నాయి.ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి వరల్డ్ కప్ నే.క్రికెట్ కు పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ 27ఏళ్ల తరువాత ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక కివీస్ విషయానికి వస్తే ప్రతీ వరల్డ్ కప్ లో మంచి ఆట ప్రదర్శించినా కప్ మాత్రం ఆ జట్టుని వరించలేదు. అయితే మరి ఈరోజు జరిగే ఫైనల్ లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.