Home / festival / మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!

మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!

నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. మంచితనం, త్యాగానికి నిరతి మొహర్రం. ఇస్లాంకు కేంద్రమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం త్యాగ స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సందేశాన్ని ఇచ్చారు. ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక, మత సామరస్యం వెల్లివిరిసేలా మొహర్రం సంతాపదినాలను పాటించాలని సీఎం కేసీఆర్ కోరారు.