వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం విశాఖపట్నం వేదికగా ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. చెన్నైలో జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ముందుసారి చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదని భావిస్తుంది. ఈమేరకు శివమ్ దుబే స్థానంలో ఠాకూర్ ని జట్టులోకి తీసుకున్నారు. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే మొదటి వన్డే విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు.