Home / SPORTS / కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !

కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !

టైటిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారా…? రాహుల్ ఏంటీ కెప్టెన్ ఏంటీ..? కోహ్లి వైస్ కెప్టెన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? పోనీ ఈ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిందా అంటే అదీ లేదు. మరి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియాలంటే ఈ కధ పూర్తిగా వినాల్సిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ జట్టుకు సారధిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ భారీ ఈవెంట్ రావాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే. అయితే ఇక ఎందులోనూ అనే విషయానికి వస్తే ఫాంటసీ లీగ్..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. చిన్నవారి నుండి పెద్దవారి వరకు దీనిమీదనే పడ్డారు.

 

 

 

దీనివల్ల కొట్లలో లాభం వస్తుంది. డ్రీమ్ 11, మై టైమ్ 11, మై 11 సర్కిల్ ఇలా వీతనింటినీ అభిమానులు వినియోగిస్తున్నారు. ఈ ఫాంటసీ లీగ్ ల కోసం ప్రత్యేకించి ఎవరికీ వివరించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎంతోమంది వీటిని ఉపయోగిస్తున్నారు. కేవలం 100లు, వేలు డబ్బులు పెట్టి లక్షలు సంపాదించుకుంటున్నారు. అయితే ఈ లీగ్స్ లో కెప్టెన్ కి, వైస్ కెప్టెన్ ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో కెప్టెన్ అయితే డబుల్ పాయింట్స్ వైస్ కెప్టెన్ అయితే 1.5 పాయింట్స్ వస్తాయి. తద్వారా మొదటి స్థానానికి ఎకబాకే అవకాసం ఉంటుంది. అయితే ఈ ఏడాది రాహుల్ మంచి ఫామ్ లో ఉండడంతో 95% అతడినే కెప్టెన్ గా పెట్టారు. ఇక కోహ్లిని వైస్ కెప్టెన్ పెట్టారు.