ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు ..ఇద్దరు ఉన్నత విద్యావంతులు .. ఒకరికి ఏమో ఉద్యమం చేసి ..ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .మరొకరేమో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డి దారిలో ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,యంగ్ డైనమిక్ లీడర్ కేటీ రామారావు ..మరొకరు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు .
అయితే గత మూడున్నర ఏండ్లుగా కేటీ రామారావు ఐటీ మంత్రిగా తెలంగాణలో పలు ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు .అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ కంపెనీ మొదలు మైక్రో మ్యాక్స్ మొబైల్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వరకు ,నిరుద్యోగ యువత భవితను మార్చే టాస్క్ నుండి టీ హబ్ వరకు,ఇంకా రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్లలోనే గూగుల్, , అమెజాన్, ఊబర్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, సేల్స్ ఫోర్స్, జెడ్.ఎఫ్, ఫ్లై దుబాయ్, డి.ఈ.షా వంటి దిగ్గజ కంపెనీలు ఇలా తీసుకొచ్చి పలు విషయాల్లో తనదైన స్టైల్ లో ఐటీ రంగానికి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు .గత మూడున్నర ఏండ్లుగా పది వేలకు పైగా ఐటీ ,ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ,కొన్ని లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు ..2014-15 లో 66,276 కోట్ల ,2015-16 లో 75,070 కోట్ల ,2016-17లో 85,470 కోట్ల రూ.ల ఐటీ ఎగుమతులు జరిగినట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ తెలిపారు .
అయితే ఒకపక్క తెలంగాణ ఐటీ రంగంలో దేశానికే కాదు ఏకంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో ఏపీ ఐటీ రంగంలో ఎక్కడో చివరి స్థానంలో ఉందని ఐటీ నిపుణులు అంటున్నారు .పట్టుబట్టి మరి ఐటీ మంత్రిని చేపట్టిన లోకేష్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో ,కంపెనీల సమావేశంలో మాట్లాడటం లాంటి విషయాల్లో అనుభవలేమి వలన అక్కడ పెట్టుబడులు ,పరిశ్రమలు పెట్టడానికి పలువురు వెనకడుగు వేస్తున్నారు అని ఐటీ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు .
ఇటీవల వైజాగ్ లో ఐటీ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ వైజాగ్ లో పెట్టుబడులకు అనుకూలం కాదు ..దానికి సంబంధించిన భూములు లేవు .ఐటీ రంగంలో గూగుల్ లో నాకే ఉద్యోగం రాలేదు ..మీకు వస్తాదా అని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ..ఐటీ పెట్టుబడుల గురించి ఇంతవరకు ఒక్క విదేశ పర్యటన చేయకుండా ఆయన తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలు చేయడం లాంటివి మంత్రి కేటీఆర్ సత్తా ముందు లోకేష్ కుదేలు అవుతున్నాడు అని ఐటీ నిపుణులు అంటున్నారు .లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇన్నాళ్ళు అయిన ఒక్క ప్రముఖ ఐటీ కంపెనీని తీసుకురాకపోవడమే ఆయన సత్తాకు నిదర్శనం అని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు .