Home / TELANGANA / “ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..

“ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..

తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం ముత్తయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు .తాజాగా మరోసారి ఆయన్ని అరెస్ట్ చేశారు .అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని ..దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ..

అంతే కాకుండా దళితులపై దాడులను ఆపాలంటూ రేపటి నుండి జరగనున్న జీఈఎస్ సదస్సుకు హాజరవుతున్న ప్రధాని మోదీ ,ఇవంకా ముందు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ మత్తయ్య ఉప్పల్ పోలీసుల అనుమతి కోరారు. అయితే మత్తయ్య అభ్యర్థనను పోలీసులు తోసిపుచ్చారు. రేపు మత్తయ్య ఆందోళనకు చేసే అవకాశం ఉందని భావించిన ఉప్పల్ పోలీసులు ఆయనను ముందస్తు అరెస్ట్ చేశారు.