ఒంటి చేత్తో తెలంగాణ సాధించిన సాహసికుడిగా, ఎన్నికల వ్యూహాలు రచించడంలో అభినవ చాణక్యుడిగా, రాజకీయ శత్రువుల పట్ల చండశాసనుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గులాబీ శ్రేణులు అభివర్ణిస్తుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తల అంచనాలకు ధీటుగా కేసీఆర్ రాజకీయ చతురత కూడా ఉంటుంది. ప్రతిపక్షాలను కడిగేయాలన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలన్నా., ప్రజల నాడి పట్టుకోవాలన్నా కేసీఆర్ తరవాతే ఎవరైన .ఇంత పకడ్బందీగా రాజకీయం చేసే కేసీఆర్ గెలుపు తెలంగాణలో అత్యంత సులువుగా మారింది. టీఆర్ఎస్ శ్రేణుల దృష్టిలో కేసీఆర్ భయంకర యోధుడు. ఆరు నూరైనా మళ్లీ పార్టీని అధికారంలోకి తేగల సమర్ధుడు. భూమి బద్ధలైనా… ఆకాశం ఊడిపడినా ఆయనున్నాడన్న ధీమా! ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంటే ఉండనీగాక, కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వచ్చేది ఖాయం అంటున్నారు పలువురు టీఆర్ఎస్ నేతలు. వాళ్ల ధీమాకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే అభివృద్ది, సంక్షేమం విషయంలో దేశంలో తమను మించిన వారు లేరని కేసీఆర్ ను ప్రజలే పోగుడుడతున్నారు. ఏ పత్రిక తిరగేసినా గులాబీ జెండానే కనిపిస్తోంది. ఏ టీవీ ఛానెల్ పెట్టినా టీఆర్ఎస్ స్లోగన్సే వినిపిస్తున్నాయి. అంతా గుడ్ వర్క్ అనేది కనబడుతుంది. టీఆర్ఎస్ పాలన అద్బుతంగా ఉందటే అది కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అనేది జగమెరగని సత్యం. అయితే గత పది రోజులనుండి అలుపనేది లేకుండా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో , ప్రజల్లో కొత్త ఊపు తెచ్చాడు. అన్ని పార్టీలపై విరుచుకుపడుతున్నారు. అందరికి అర్థమయ్యోలా తన ప్రసంగాలతో మహాకూటమీని తరిమి కొట్టాలని సభల్లో చెబుతున్నాడు. గత నాలుగేండ్లు,, ఏం చేశారు..మళ్లీ గెలిచాక ఏం చెయబోతున్నారనే విషయాలు స్పష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ మీటంగ్స్ తో టీఆర్ఎస్ పార్టీలో ఫుల్ జోష్ పెరిగిందని చెప్పవచ్చు.