టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.
