తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది.మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 19న ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.ఈరోజు సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి మంత్రివర్గంపై చర్చించారు.మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం.అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది.19వ తేది మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో ఉదయం 11.30కు మంత్రివర్గ విస్తరణం జరగనుంది.
