ఈ రోజు బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వంద పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ కొద్దిసేపటి క్రితం 109పాయింట్ల లాభంతో 38,674వద్ద ట్రేడవుతోంది.
అటు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో 11,610 వద్ద ఉంది. అమెరికా స్టాక్స్ నిన్న భారీ లాభాలు ఆర్జించడంతో పాటు ఈ రోజు ఆస్ట్రేలియా సహా ఆసియా మార్కెట్లూ సానుకూలంగా ట్రేడవడం దీనికి ప్రధాన
కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు
